కరోనా నియంత్రణ చర్యల్లో ‘వార్త’ ముందడుగు

ట్రాక్టర్లతో గ్రామాల్లో రసాయన ద్రావణం పిచికారీ

chemical spraying in village

హయత్‌నగర్‌ (రంగారెడ్డి జిల్లా-తెలంగాణ): రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది..
రాష్ట్రంలోనే తొలిసారిగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్టే వేసే చర్యల్లో భాగంగా తెలుగు జాతీయ దినపత్రిక ‘వార్త’ భాగస్వామ్యం అయ్యింది..

chemical spraying at Hayat Nagar PHC

రంగారెడ్డిజిల్లా హయత్‌నగర్‌ మండలం అబ్దుల్లాపూర్‌ గ్రామంలో ‘వార్త’ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు..

బుధవారం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలుకొని పలు వీధుల్లో పారిశుద్ధ్య పనులు ప్రారంభించింది ట్రాక్టర్లపై రసాయన ద్రావణం ట్యాంకర్లతో పిచికారీ చేశారు.

.కరోనా మహమ్మారిని తరిమేద్దామని, అందరూ లాక్‌డౌన్‌ కాలంలో ఇళ్లలోనే ఉండి కరోనాను కట్టడి చేద్దామని వార్త సిబ్బంది పిలపునిచ్చారు.

కార్యక్రమంలో స్థానిక వార్త సిబ్బందితోపాటు, గ్రామపారిశుధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరోనా నివారణ చర్యలకు ‘వార్త ‘పూనుకోవటం అభినందనీయమని అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

ఈ విషయమైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి ‘వార్త’ ఆదర్శప్రాయంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

బద్వేలులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

Badvelu-distribution of Essential goods to poor

కడప జిల్లా: లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఒకింత ఊరట కల్గించేలా తెలుగు జాతీయ దినపత్రిక ‘వార్త’ ఆధ్వర్యంలో బుధవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు..

బద్వేలుగా జరిగిన కార్యక్రమంలో పలువురు నిరుపేదలకు అవసరమైన నిత్యావర సరుకులను అందజేశారు. ‘వార్త’ దినపత్రిక సిబ్బంది సేవాకార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/