సల్మాన్‌ డైట్‌ సీక్రెట్స్‌ తెలుసుకున్న ఉపాసన

సల్మాన్‌ ఇంటర్వ్యూలో ఆరోగ్య రహస్యాలు వెల్లడి

salman khan, upasana
salman khan, upasana

మెగా పపర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కి సల్మాన్‌కి మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సందర్భాల్లో మెగా కుటుంబాన్ని కలుస్తూ ఉండే సల్మాన్‌ తాజాగా మెగా కోడలు ఉపాసనకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆరోగ్యం, డైట్‌ ప్లాన్స్‌, ఫిట్‌నెస్‌కి సంబంధించిన తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు ఉపాసన. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది ఉపాసన. మీ సీక్రెట్స్‌ మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్‌. ఉపాసన ప్రస్తుతం ఉప్సీ అపోలో గ్రూప్‌కు చెందిన బి పాజిటివ్‌ మేగజైన్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పాఠకులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ని అడిగి పలు విషయాలు తెలుసుకుంది ఉపాసన.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/