సోనాక్షిపై యుపి పోలీసులు ఛీటింగ్‌ కేసు

Sonakshi Sinha
Sonakshi Sinha, Bollywood actress

ముంబై: బాలీవుడ్‌ భామ, మాజీ ఎంపి శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాపై యుపి పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే సోనాక్షి సిన్హా 2018లో స్జేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ. 24 లక్షలు తీసుకుని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యుపిలోని కట్‌ఘర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యుపి పోలీసులు ఐపిసి సెక్షన్‌ 420, 406ల కింద కేసు నమోదు చేశారు. ఛీటింగ్‌ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు యుపి నుంచి వచ్చిన పోలీసు బృందం గురువారం సాయంత్రం సోనాక్షి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరు.
బిజెపి మాజీ ఎంపి, సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు సోనాక్షి తల్లి సమాజ్‌ వాదీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో తల్లి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన సోనాక్షిపై యుపి పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/