దర్యాప్తులు మాకేం కొత్త కాదు

sundar pichai
sundar pichai, google ceo

వాషింగ్టన్‌: నమ్మకాన్ని వమ్ము చేసిన కేసులో గూగుల్‌ సంస్థలో దర్యాప్తు జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే నియంత్రణలు విధిస్తే సంబంధిత పరిణామాలు ఊహకు అందవని గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. టెక్‌ దిగ్గజాలను నియంత్రించాలను కోవడంపై ఆయన హెచ్చరించారు. సిఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా తమపై ఐరోపా సంఘంలో ఇలాంటి దర్యాప్తులను ఎదుక్కొన్నామని అందుకే తాను ఇప్పుడేమీ ఆశ్చర్యపోవడంలేదని ఆయన తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/