నిరుద్యోగ భృతి కోసం 4.1 కోట్ల మంది దరఖాస్తు

అమెరికాలో ఏప్రిల్‌లో 14.7 శాతానికి నిరుద్యోగిత

unemployment-in-america

అమెరికా: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో నిరుద్యోగిత అమాంతం పెరిగిపోతోంది. లాక్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకున్నప్పటికీ ఉద్యోగాల కోతలు మాత్రం ఆగడం లేదు. ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగులను ఇళ్లకు పంపుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత వారం రోజుల్లో కొత్తగా 21 లక్షల మందికిపైగా ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు ఇలా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 4.1 కోట్లకు చేరింది. మహా మాంద్యం తర్వాత తొలిసారి ఏప్రిల్‌లో అమెరికాలో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి చేరగా, ఈ నెలలో అది 20 శాతానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/