కుల్‌భూషణ్‌ కేసులో నేడు తీర్పివ్వనున్న ఐసిజె

Kulbhushan Jadhav
Kulbhushan Jadhav, former naval officer

ది హేగ్‌: భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ పాకిస్థాన్‌ చెర నుంచి విడుదలవుతారో లేదో వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) తీర్పు చెప్పబోతుంది. 2016లో పాక్‌ భద్రతా దళాలకు చిక్కిన 49 ఏళ్ల కుల్‌భూషణ్‌..గూఢచర్యానికి, ఉగ్రవాదానికి పాల్పడ్డారంటూ ఆ దేశ సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌ అదే ఏడాది మే 8న ఐసిజేను ఆశ్రయించింది. ఆయన ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటుండగా అక్రమంగా నిర్భంధించారని, న్యాయమూర్తి అబ్దుల్‌ ఖవి అహ్మద్‌ యూసుఫ్‌ నేతృత్వంలోని పది మంది సభ్యుల ధర్మాసనం, తీర్పిచ్చే వరకు మరణశిక్ష అమలును నిలిపివేయాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై గత ఫిబ్రవరిలో విచారణ చేపట్టి, ఉభయ దేశాల వాదలనలను వింది. భారత కాలమానం ప్రకారం అంటే ఈ రోజు సాయంత్రం 6.30కు ది హేగ్‌లోని ఐసిజే తీర్పు వెలువరించనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/