బ్రిటన్‌ ప్రధాని పదవి నుంచి తప్పుకున్న థెరిసా మే

theresa may
theresa may


లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరీసా మే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బ్రెగ్జిట్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో విఫలమైనందున ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వం నుంచి ఆమె వైదొలిగారు. కొత్త ప్రధాని నియమితులయ్యేంతవరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. బ్రెగ్జిట్‌పై గడురు అక్టోబరు 31తో ముగియనుండగా కొత్తగా ప్రధాని పదవిని చేపట్టే వ్యక్తికి స్వల్ప వ్యవధి మాత్రమే మిగిలిఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/news/international-news/