మాల్యాపై కేసు విచారణ ఇప్పట్లో లేనట్టే!

స్పష్టం చేసిన యూకే కోర్టు

Vijay Mallya
Vijay Mallya

లండన్‌: ఇండియాలోని బ్యాంకులకు వేల కోట్ల కుచ్చు టోపీ పెట్టి, లండన్‌కు పారిపోయి తలదాచుకున్న యుబి గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ విజయ్‌ మాల్యాకు భారీ ఊరట లభించింది. తనను తిరిగి ఇండియాకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మాల్యా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పట్లో విచారణ జరగబోదు. ఈ కేసు విచారణ ఇప్పట్లో విచారణను చేపట్టలేమని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో విచారిస్తామని యూకే కోర్టు గురువారం నాడు స్పష్టం చేసింది.
కాగా, మాల్యాను భారత్‌కు అప్పగించాలని వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు నిర్ణయించిన తరువాత, ఆయన రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌ను ఆశ్రయించగా, అప్పీల్‌ చేసుకునేందుకు మాల్యాకు అవకాశమిచ్చారు. దీనిపై ఆయన అప్పీలుకు వెళ్లగా తాజా నిర్ణయం నేడు వెలువడింది.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/