అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ. కోటి విరాళం

బిజెపికి మాత్రమే దూరమయ్యాం.. హిందుత్వకు కాదు

Will donate Rs 1 crore for Ram Temple construction
Will donate Rs 1 crore for Ram Temple construction

ముంబయి: మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ థాకరే సిఎం అయితే తర్వాత ఈరోజు తొలిసారిగా అయోధ్యకు వచ్చారు. ఈసందర్భంగా అయోధ్యలో ఆయన మాట్లాడుతూ.. అయోధ్య రామాలయ నిర్మాణానికి ఒక కోటి రూపాలయ విరాళం ఇస్తామని ప్రకటించారు. బిజెపి అంటే హిందుత్వ కాదని చెప్పారు. హిందుత్వ అనేది మరో అంశమని… దీంతో తాము విడిపోలేదని అన్నారు. బిజెపికి మాత్రమే శివసేన దూరమయిందని, హిందుత్వకు తాము దూరం కాలేదని ఆయన అన్నారు. 2018 నవంబర్ లో తాను అయోధ్యకు వచ్చినప్పుడు… రామాలయ నిర్మాణానికి సంబంధించి సందిగ్ధత ఉందని థాకరే చెప్పారు. 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిందని, ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని… ఇదే సమయంలో తాను సీఎం కూడా అయ్యానని తెలిపారు. అయోధ్యకు తాను రావడం ఇది మూడోసారి అని… ఇక్కడకు ఎప్పుడొచ్చినా శుభమే జరుగుతుందని చెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/