తిరుమలేశునికి నవదిన ‘చంద్ర’గ్రహణం

TTD TEMPLE
TTD TEMPLE

తిరుమలేశునికి నవదిన ‘చంద్ర’గ్రహణం

టిటిడి సంచలన నిర్ణయంతో యావత్‌భక్తుల సంశయం!
9వతేదీ సాయంత్రం 6గంటలనుంచి భక్తులకు దర్శనం బంద్‌

తిరుమల: ప్రపంచంలోనే కలియుగవైకుంఠంగా విరాజిల్లుతున్న… రెండు వేల సంవత్సరాల పైబడిచరిత్రవున్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం తొమ్మిదిరోజులు మూసివేయాలని ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న టిటిడి పెద్దలు నిర్ణయించారు. యావత్తు భారతదేశం విస్తుపోయేలా టిటిడి పెద్దలు ఈ మహాగర్హనీయ నిర్ణయం తీపుకున్నారు. అటు కోట్లాదిమంది భక్తు ల్లోనూ ఇటు వందలాది మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధువులు నిరసన వ్యక్తం చేస్తు న్నట్లు తెలుస్తోంది.

గతంలో ఎన్నో పర్యాయాలు మహాసంప్రోక్షణం తిరుమల శ్రీవేంకన్న ఆల యంలో నిర్వహించబడింది. ఒకేరోజు లక్షలాది మందిభక్తులు స్వామివారి ఆలయాన్ని బయటి నుంచి తిలకించి చూసిపోయే మహాభాగ్యం కలిగింది. కానీ స్వామివారి భక్తులు కొండపైకే రాకూడదని సైనికపరిపాలనను, నియంతుల పాలనను తలపిస్తూ టిటిడి పెద్దలు ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఇవో అనిల్‌కుమార్‌సింఘాల్‌, తిరుమల జెఇవో కెఎస్‌ శ్రీనివాసరాజు ముగ్గురు కలసి ఆగమ సలహాలను అమలుచేయించే అర్చ కులను ఒప్పించి తొమ్మిదిరోజులు పాటు భక్తు లను కొండపైకి రానీయకూడదని ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిటిడి తీసుకున్న నిర్ణయంతో యావత్తుభక్తులు సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శని వారం తిరుమల అన్నమయ్యభవన్‌లో టిటిడి ధర్మకర్తలమండలి అత్యవసర సమావేశం జరి గింది.

రానున్న ఆగస్టునెలలో 12వతేదీ నుంచి 16వతేదీ వరకు ఐదురోజులుపాటు తిరుమలే శుని ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ జరగనుంది. ఈ పవిత్ర కార్యక్రమా నికి 11వతేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందుకోసం రెండురోజులు ముందుగానే ఆగస్టు 9వతేదీ గురువారం సాయంత్రం 6గంటలనుంచే భక్తులను క్యూలైన్లు మరియు వైకుంఠం కంపార్టు మెంట్లలోనికి అనుమతించరు. ఇదే విధానాన్ని ఆగస్టు 17వతేదీ వరకు అమలులోవుంటుంది. ఆగస్టు 17వతేదీ శుక్రవారం ఉదయం 6గంటల నుంచి భక్తులకు దర్శనం పున:ప్రారంభ మవుతుంది.