ఇండొనేసియాలో సునామీ విధ్వంసం

TSUNAMI-
TSUNAMI-

ఇండొనేసియాలో సునామీ విధ్వంసం

వేలాది ఇళ్లు నేలమట్టం
222 మంది పైగా మృతి
840 మందికి తీవ్ర గాయాలు

జకార్తా: ఇండోనేసియాను మరోసారి త్సునామి వణికించింది. సుమారు 222 మంది చనిపోగా వందలాదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 843మందికి తీవ్ర గాయాలయినట్లు అధికారులు తెలిపారు. 30 మంది ఆచూకి ఇప్పటికీ తెలియడంలేదు. ఇండొనేసియా జాతీయ ఉపద్రవ నివారణసంస్థ ప్రతినిధి సుతోపో పుర్వో నుగ్రోహో మాట్లా డుతూ తీవ్రస్థాయి భూకంపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోయారని చెప్పారు. దక్షిణ సుమత్రా, పశ్చిమప్రాంత జావా ద్వీపకల్పంలోరాత్రి 9.30 గంటలకు అంటే భారత కాలమానంప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సునామి వచ్చింది. క్రోకోటా అగ్నిపర్వతశ్రేణుల్లోని ఒక పర్వతంనుంచి వెల్లువెత్తినవాల్కనో ప్రవహించడం కూడా ఇందుకు తోడయింది. అనేకచోట్ల ఇళ్లు, ఇనప ఊచలతో ఉన్న పైకప్పులు, కలప, ఇక మొత్తం సామగ్రి ధ్వంసం అయ్యాయి. కోస్తాప్రాంతంలోని కేరిటా బీచ్‌వద్ద మరింతగా నష్టం వాటిల్లిందని చెపుతున్నారు. ప్రతిచోటా వృక్షాలు వేళ్లతోసహా పెకలించినట్లుగా కూలిపడిపోయాయి. అకస్మాత్తుగా సముద్ర జలతరంగాలు ఉఎ=వ్వెత్తున ఎగిసిపడ్డాయని, పర్యాటక ప్రాంతాన్ని ఒక్కసారిగా చీకటిమయం చేసాయని అన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు ఈబీచ్‌కు వచ్చామని, అకస్మాత్తుగా జలప్రళయం వచ్చిందని, అనంతరం చీకటిమయం అయిందని, విద్యుత్‌ మొత్తం నిలిచిపోయిందని చెప్పారు. రోడ్డుపైకి వెళ్లే అవకాశం కూడా లేదని వెల్లడించారు. లాంపుంగ్‌ప్రాదేశిక ప్రాంతంలో కూడా ఇదే విధంగా కలి యాందా నగరానికి సమీపంలో ఉన్న బీచ్‌లో మొత్తం ధ్వంసం అయ్యాయి. మోటార్‌బైక్‌నుసైతం స్టార్ట్‌చేయలేక పరుగులుతీసానని ఒక పర్యాటకుడు చెప్పాడు. సునామి రాకతో ఒక్కసారిగా ఉవ్వెత్తున అలలు ఎగిసిపడ్డాయని, భూగర్భంలో ప్రళయం రావడంతో అనక్‌ క్రోటానుంచి లావా వెల్లువలా రావడం వంటివాటితో చిన్న ద్వీపకల్పం అయిన సుందా సంధికూడా సునామి ప్రభావానికి లోనయింది. ఈ ప్రాంతం జావా, సుమత్రా దీవుల మధ్య నెలకొని ఉంది. ఇండోనేసియా భూగర్భ శాస్త్రవేత్తలు ఈసునామి ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందీకూడా ఇంకా అధ్యయనంచేస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగాపెరిగే అవకాశం ఉంది. ముందు సునామీ కాదని, జల ప్రళయమని పేర్కొన్న అధికారులు తదనంతరం సునామీ అని ధృవీకరించారు. సుందా సంధివద్ద కోస్తా తీరం మొత్తం విజృంభించింది. ఎక్కువగా పాండెగ్లాంగ్‌జిల్లాలో నష్టంజరిగింది. జావా పశ్చిమప్రాంతంలో సుమారు 33 మంది చనిపోగా 491 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సెరాంగ్‌లో ముగ్గురుచనిపోయారు. మరో ఏడుగురు దక్షిణ లాంపుంగ్‌లో చనిపోయారు. భారీ నష్టంజరిగిన ప్రాంతాలకు బపెద్ద పెద్దయంత్రాలను సైతంతరలించారు. ఆప్రాంతాలను ఖాళీచేయించి బాధితులకోసం సామూ హిక వంటశాలలనుసైతం ఏర్పాటుచేసారు. ఇప్పటికీ అనేకమంది ఆచూకీ తెలియలేదన్నారు. జలాంతర్గామి తరహా లావా ప్రవహించడం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సముద్రగర్భంనుంచి వచ్చే లావా కారణంగా సునామీలు వస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అనక్‌ క్రకోటా ఒక చిన్న లావా వెదజల్లే ద్వీపం. అర్ధశతాబ్దం కింద క్రోటాలో 1883లో వెల్లువెత్తిన సునామి కారణంగా 36వేల మందికిపైగా మృతి చెందారు. శనివారం రాత్రితొమ్మిది గంటలకు అగ్నిపర్వతం బద్దలయిందని చెపుతున్నారు. బద్దలయిన 13 నిమిషాలకే పెద్దఎత్తున బూడిదను వందల మీటర్లమేర వెదజల్లిందని ప్రత్యక్ష సాక్షులుచెపుతున్నారు.