‘ముందస్తు’పై మోడీతో మంతనాలు

TS CMKCR MET MODI
TS CMKCR MET MODI

‘ముందస్తు’పై మోడీతో మంతనాలు

కొత్త జోనల్‌ వ్యవస్థపై త్వరలో రాZపపతి ఉత్తర్వులు?
అదనపు ఎఫ్‌ఆర్‌బిఎం నిధులు విడుదల చేయండి
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్లు విడుదలకు విజ్ఞప్తి
హైకోర్టును విభజించండి.. సచివాలయానికి రక్షణ భూములు కేటాయించండి
కేంద్రం వద్ద పెండింగ్‌లోని అంశాలన్నీ సత్వరమే పరిష్కరించండి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరిన ముఖ్యమంత్రి కెసిఆర్‌

్జహైదరాబాద్‌ఫ ముందస్తు ఎన్నికల వ్యూహంతో హస్తినకు చేరిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా చర్చించారు. దాదాపు 20 నిముషాల పాటు వారి మధ్య జరిగిన సం భాషణ వివరాలు పూర్తిగా బయటకు వెల్లడి కాకపోయినప్పటికీ ఈ మేరకు ప్రధానితో కచ్చితమైన హామీతోనే సిఎం తరువాత కార్యక్రమాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇక ప్రధానితో తమ చర్చలు సఫలం అయ్యాయని కీలక హామీలు ఇచ్చారని భేటీ తర్వాత టిఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ కుమార్‌ వెల్లడించారు. కొత్త జోనల్‌ వ్యవస్థ ఆమోదం తమ విజయమని తెలంగాణ ప్రభుత్వానికి, నిరుద్యోగులకు ఇది శుభసూచకమని వినోద్‌ మీడియాకు తెలిపారు. కాగా రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడుతాయని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కొత్త జోన్లు ఏర్పాటు అవ్ఞతాయని ఆయన వివరిస్తూ 60 ఏళ్లుగా తెలంగాణ మోస పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్ధిక అవసరాలను తాము ప్రస్థావించగా మంత్రి అరుణ్‌ జైట్లీతో ఆ అంశాలు చర్చించాలని ప్రధాని సూచించి నట్లు తెలిపారు. మూడు రోజుల పర్యటనకు న్యూఢిల్లీ వెళ్లిన కెసిఆర్‌ శనివారం బిజిబిజీగా గడిపారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సం బంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను ఆయన ప్రధాని వద్ద ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం..ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్తజోనల్‌ వ్యవస్థను వెంటే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్థిం చారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుం డటం..కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అదనపు ఎఫ్‌ఆర్‌బిఎం నిధులను విడుదల చేయాలని, మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీతో, రైతులకు ఇవ్వాల్సిన రూ.400 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.