మరో పదేళ్లు నేనే సీఎం : కేసీఆర్

TS CM KCR
TS CM KCR

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌పై చర్చ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మారుతాడన్న పుకార్లపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని చాలా దుష్ప్రచారం జరుగుతోందని, ఇక కేసీఆర్ దిగిపోయి కుమారుడు కేటీఆర్‌ను కుర్చీలో కూర్చోబెడతారని ఊహాగానాలు వస్తున్నాయని ఇవన్నీ అబద్దమన్నరు. నాకేమీ కాలేదని, ఆరోగ్యంగానే ఉన్నానన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలోకి వస్తుందన్నారు. తనకిప్పుడు 66 ఏళ్లు వచ్చాయని, కనీసం ఇంకో పదేైళ్లెనా పని చేయగలుగుతానన్నారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నాకు అవి దీవెనలుగా పనిచేస్తాయని కేసీఆర్ అన్నారు.