మధ్యవర్తిత్వానికి సిద్ధం

Trump With Media
Trump With Media

NewYork: కాశ్మీర్‌ సమస్య పరిష్కరించడానికి మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. భారత ప్రధాని మోడీతో తనకు సత్సంబంధాలున్నాయని, అలాగే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌తో కూడా తనకు మంచి సంబంధాలున్నాయని ఆయన అన్నారు. వారిద్దరూ ”ఒక సమస్య పరిష్కరించాల్సి ఉంది” అనే పక్షంలో దానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తాను మధ్యవర్తిత్వంవహించడంలో ఎంతో నైపుణ్యమున్నవాడినని ఆయన చెప్పారు.