అధ్యక్ష పదవికి మరోమారు ట్రంప్‌ పోటీ!

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీ చేసే విషయమై జూన్‌ 18న అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. ఫ్లోరిడాలో నిర్వహించే కార్యక్రమంలో పోటీ చేసే విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ట్రంప్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనే ఆయన 2020లో మరోమారు పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 నవంబరు 3వ తేదీన జరగనున్నాయి.

వార్తా ఈ పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/