దాడులను అడ్డుకోవడం కోసమే ఈదాడి

లండన్ లోనూ ఉగ్ర దాడులకు సోలెమన్‌ కుట్రలు పన్నాడన్న ట్రంప్

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ నిఘా విభాగం ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ను చంపేసిన విషయం పై స్పందించారు. నిన్న ఆయన ఓ కార్యక్రమంలో దీనిపై స్పందించి పలు వివరాలు తెలిపారు. భారత్ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రదాడులకు ఇరాన్‌ నిఘా విభాగం ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ కుట్ర పన్నాడని ట్రంప్ అన్నారు. అతడు లక్షలాది మంది ప్రజలపై దాడులు చేసిన ఘటనల్లో ముఖ్య పాత్ర పోషించాడని ట్రంప్ చెప్పారు. ఇరాక్ లో అమెరికా పౌరులపై జరిపిన దాడుల్లోనూ ఆయన పాత్ర ఉందని చెప్పారు. న్యూఢిల్లీ, లండన్ ల్లో ఉగ్ర దాడులకు ఆయన కుట్రలు పన్నాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన చేయబోయే దాడులను అడ్డుకోవడం కోసమే తాము అతడిని హతమార్చినట్లు వివరించారు. కాగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడి చేసి ఇరాన్‌ నిఘా విభాగం ఖడ్స్‌ ఫోర్స్‌ అధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ను చంపేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/