ట్రంప్‌ ట్వీట్లపై నాసా క్లారిటీ

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల వల్ల ట్విట్టర్‌లో భూకంపం వచ్చినంత పనైంది. తాజాగా ఆయన చంద్రుడు కూడా అంగారకునిలో భాగమేనంటూ పెట్టిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ గోల ఎంతకీ సద్దుమణగకపోవటంతో చివరికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా రంగంలోరి దిగి ట్రంప్‌ చేసిన ట్వీట్లపై క్లారిటీ ఇచ్చింది. ట్రంప్‌ చెప్పినట్లుగా చంద్రుడి సాయంతో నాసా అంగారకుడిపై మానవులను చేరవేస్తుంది. ఇప్పటికే క్యూరియాసిటీ, ఇన్‌సైట్‌లు మార్స్‌కు చేరుకున్నాయి. త్వరలో మరో మార్స్‌ హెలికాప్టర్‌ కూడా వాటికి తోడుగా అక్కడికి చేరుకుంటుంది అంటూ ట్వీట్‌ చేసింది. ఇక ఈ ట్వీట్స్‌తో సోషల్‌ మీడియా శాంతిస్తుందో లేదో చూడాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/