అల్‌ఖైదా కీలక వ్యక్తి హతం

యెమన్‌లో అమెరికా జరిపిన దాడుల్లో హతం: ధ్రువీకరించిన అమెరికా

Qasim al-Raymi
Qasim al-Raymi

వాషింగ్టన్‌: అమెరికాలో కీలక ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా నేత ఖాసిం అల్ రేమి హతమయ్యాడు. అల్ ఖైదాలో నెట్‌వర్క్ దళంలో కీలక వ్యక్తిగా ఎదిగిన రేమిని అమెరికా జవాన్లు కాల్చిచంపారు. యెమెన్‌లో జరిపిన తీవ్రవాద నిరోధకదాడుల్లో అతడు హతమైనట్టు తెలుస్తోంది. దీనిని ధ్రువీకరించిన వైట్‌హౌస్ .. ఈ ఘటన సరిగ్గా ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. రేమిని 2015 నుంచి అల్‌ఖైదాలో పనిచేస్తున్నాడు. మరోపక్క, మారిబ్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఖాసిం హతమైనట్టు గత నెలలోనే వార్తలు హల్‌చల్ చేశాయి.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/