గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పై ట్రంప్‌ ప్రశంసలు

Donald Trump, Sundar Pichai
Donald Trump, Sundar Pichai


వాషింగ్టన్‌: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తో వైట్‌హౌస్‌లో బుధవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ సదర్భంగా సుందర్‌ పిచాయ్‌ ని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. చైనా సైన్యం కోసం పని చేయడం లేదని, అమెరికా సైన్యం కోసం పని చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ట్విటర్‌ ద్వారా తమ సమావేశం గురించి తెలిపారు. చైనా కోసం పని చేస్తున్నారంటూ.. గతంలో గూగుల్‌పై విమర్శలు చేసిన ట్రంప్.. ఈసారి మాత్రం సానుకూలంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాము రాజకీయ అంశాలతో పాటు చాలా విషయాలు చర్చించామని.. తమ భేటీ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఇదిలా ఉంటే సుందర్ పిచాయ్‌ను ట్రంప్.. ప్రెసిడెంట్ ఆఫ్ గూగుల్‌గా సంబోధించి మరింత ఆశ్చర్యపరిచారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/