జపాన్‌, అమెరికా నుంచి ఎఫ్‌-35 విమానాల కొనుగోలు!

F-35 stealth fighter jet
F-35 stealth fighter jet

టోక్యో: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జపాన్‌ పర్యటనలో ఉన్నారు. జపాన్‌ దేశ ప్రధాని షింజో అబేతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..ఉత్తర కొరియా నుంచి ఎదురవుతున్న అణ్వస్త్ర ముప్పుపై ట్రంప్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ చాలా స్మార్ట్‌ అని సరైన విధంగా వ్యవహరించే తీరు ఆయనకు తెలుసునని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అణ్వస్రాలతో చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయనకి తెలిసి కూడా దానిని అమలు జరపడం లేదని అన్నారు. అణ్వస్త్రాలను త్యజిస్తే ఉత్తరకొరియా ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటుందని తాను భావిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. అణ్వస్త్రాలను అభివృద్ది చేస్తుంటే మాత్రం ఇది సాధ్యం కాదని పేర్కొన్నారు.
జపాన్‌ తమ దేశం నుంచి ఎఫ్‌-35 యుద్ధ విమానాల కొనుగోలుకు జపాన్‌ ఆసక్తి తెలిపింది. ఈ యుద్ధ విమానాలు ఉన్న అతి పెద్ద అమెరికా మిత్రపక్ష దేశంగా జపాన్‌ నిలవనుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/