ట్రక్కు, కారు గుర్తుల తొలగింపు!

Election Commission
Election Commission


న్యూఢిల్లీ: టిఆర్‌ఎస్‌ పార్టీ ఫిర్యాదు మేరకు ట్రక్కు, కారు గుర్తును ఫ్రీ సింబల్స్‌ జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని టిఆర్‌ఎస్‌ ఎంపి వినోద్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.., కారు గుర్తును అందరికీ కనిపించేలా బోల్డ్‌గా బ్యాలెట్‌ పేపర్‌లో ప్రచురిస్తామని ఈసి హామి ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఇస్త్రీ పెట్టె గర్తును కూడా ఫ్రీ సింబల్స్‌ జాబితా నుండి ఈసి తొలగించారు.