కరోనాపై పోరాటానికి త్రివిక్రమ్ రూ.20 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్ కు రూ.10 లక్షలు, తెలంగాణకు రూ.10 లక్షలు 

Film Director Trivikram Sriniivas

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు దర్శకుడు త్రివిక్రమ్.

ఈ నేపథ్యంలో కరోనా సహాయక చర్యల కోసం తెలుగు రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి  ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ‌విరాళం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.10 లక్షల  చొప్పున విరాళం అందజేస్తానని వెల్లడించారు. ఈ విరాళాలను  ప్రభుత్వాలకు త్వరలోనే అందచేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన‌ చేశారు. 

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/