ఆధునికంగా తయారై మద్యం తాగలేదని త్రిపుల్‌ తలాఖ్‌!

Triple talaq .. due to not modern and does not drink alcohol

New Delhi: బీహార్‌కు చెందిన ఒక ముస్లిం మహిళ ఆధునికంగా తయారు కావడం లేదని, మద్యం సేవించడం లేదని ఆమె భర్త ఆమెకు త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పాడు. విలాసంగా కనిపించే దుస్తులు ధరించడం లేదని, మద్యం సేవించడం లేదని తన భర్త తనకు త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి విడాకులు ఇచ్చారని నూరి ఫాతిమా అనే మహిళ ఆరోపించింది.

ఇమ్రాన్‌ ముస్తాఫా అనే వ్యక్తితో 2015లో వివాహం తరువాత వారు ఢిల్లికి మకాం మార్చారు. అప్పటినుంచి ఆధునిక యువతుల్లాగా తనను కురచ దుస్తులు వేసుకోవాలని, రాత్రి పార్టీలకు వెళుతూ మద్యం సేవించాలని తన భర్త చెప్పాడని ఆమె తెలిపింది. అయితే దీనికి తాను తిరస్కరించానని, అతడు రోజూ తనను కొట్టేవాడని ఆమె చెప్పింది.

కొద్ది రోజుల క్రితం తనను ఇల్లు విడిచి వెళ్లిపోవాలన్నాడని, తాను వెళ్లనని చెబితే అక్కడికక్కడ త్రిపుల్‌ తలాఖ్‌ చెప్పి విడాకులు ఇచ్చాడని ఆమె తెలిపింది. రాష్ట్ర మహిళా కమిషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కమిషన్‌ ఆమె భర్తకు నోటీసు జారీ చేసింది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/