కరోనా రోగులకు మూడు రకాల ఆసుపత్రుల్లో చికిత్స

రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రప్రభుత్వం

doctors
doctors

దిల్లీ: దేశంలో కరోనా సోకిన వారిని, వారి వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స చేయాలని, అందకు మూడు రకాల ఆసుపత్రులను ఏర్పాటుచేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. కరోనా అనుమానితులను కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లలో, కరోనా తీవ్రత మధ్యస్థంగా ఉన్న వారిని కోవిడ్‌ హెల్త్‌ సెంటర్‌లలో, తీవ్రత అధికంగా ఉన్న వారిని కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబందించిన మార్గదర్శకాలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేసింది. కరోనా కేసుల్లో సుమారు 70 శాతం ప్రాథమిక దశలోనే ఉన్నందున కోవిడ్‌ కేర్‌, కోవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌లలోనే చికిత్స చేయవచ్చని అధికారులు తెలిపారు. సూచించిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లు, కోవిడ్‌ హెల్త్‌ సెంటర్‌లు, అలాగే కోవిడ్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/