సేతుపతిని, దర్శకుడిని అరెస్టు చేయాలని హిజ్రాల డిమాండ్‌

Vijay Sethupathi
Vijay Sethupathi

సూపర్‌ డీలక్స్‌ చిత్రంతో హిజ్రాగా ప్రజల ముందుకు వచ్చిన విజయ సేతుపతి ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నాడు. ఈ చిత్రంలో హిజ్రా పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఐతే శిల్లా అనే హిజ్రా పాత్ర పోషించిన సేతుపతి చిత్రంలో ముంబైలో పిల్లలను కిడ్నాప్‌ చేసి భిక్షం ఎత్తించేవారికి విక్రయిస్తాడు. దీనిపై హిజ్రాలు మండిపడుతున్నారు. ఇన్నాళ్లు సేతుపతి అంటే గౌరవం ఉండేదని, కాని ఇప్పుడు ఈ పాత్రలో నటించి మమ్మల్ని అవమానించడం బాధగా ఉందని వాపోతున్నారు.
నిజానికి హిజ్రాలు పిల్లలపై ప్రేమ చూపుతారని వారు ఎన్నటికీ పిల్లలను కిడ్నాప్‌ చేయరని వారు అంటున్నారు. హిజ్రాలకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదు కాని ఆ చిత్ర దర్శకుడు త్యాగరాజు కుమారరాజా సేతుపతిని ఓ పిల్లాడికి తండ్రి ఐన సేతుపతి హిజ్రాగా మారినట్లు చూపించారు. ఇలా చిత్రంలో పలు అంశాలు హిజ్రాల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అందుకే సేతుపతిని, దర్శకుడిని అరెస్టు చేయాలంటూ హిజ్రాల సంఘం డిమాండ్‌ చేస్తున్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/