ప్రయాణికుల రైళ్లు ప్రారంభం

నేటి సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్

train
train

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డైన్‌ కారణంగా సుమారు 50 రోజులుగా స్తంభించుకుపోయిన రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 12 (మంగళవారం ) నుంచి కొన్ని రూట్లలో ప్రయాణికుల కోసం రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ నుంచి ముఖ్య నగరాలకు ప్రయాణికుల రైళ్లు నడపనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్ సీటీసీ ద్వారా ఆన్ లైన్ బుకింగ్స్ షురూ కానున్నాయి. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై సెంట్రల్, తిరువనంతపురం, అహ్మదాబాద్, జమ్మూతావి, అగర్తలా, హౌరా, పాట్నా, దిబ్రూగఢ్, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్ నగరాలకు రైళ్లను నడపనున్నారు. కరోనా లక్షణాలు లేనివారినే రైళ్లలో అనుతిస్తారు.  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ https://www.irctc.co.in/ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో టికెట్లు విక్రయించరు.  ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్‌ అయితేనే స్టేషన్‌లోకి అనుమతిస్తారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/