యువతి అందంగా ఉందని ట్రాఫిక్ పోలీస్ చలానా

ఉరుగ్వే: అమ్మాయిలను ఆకర్షించడానికి అబ్బాయిలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కోసారి అమ్మాయిలను వాడుకోడానికి తమ వృత్తిని కూడా వాడుకుంటూ ఉంటారు. అయితే చట్టానికి లోబడి పనిచేస్తున్న ఓ అధికారి తన వృత్తిని ప్రేమ కోసం వాడుకుంటే? ఉరుగ్వేలో సరిగ్గా ఇదే జరిగింది. పెసందే ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బండి మీద వెళ్తున్న ఓ యువతిని విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ పోలీస్ ఆపి.. ఆమెకు చలానా రాశాడు. హెల్మెట్ లేదనో, లెసెన్స్ లేదనో రాస్తే అనుకోవచ్చు.. అందంగా ఉందని యువతికి చలానా రాశాడా పోలీస్. పబ్లిక్ రోడ్లపై అందగత్తె(ఎక్సెసివ్ బ్యూటీ ఆన్ పబ్లిక్ రోడ్స్) అంటూ చలానా రాశాడు. ఆ చలానాను యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఒక్కసారిగా ఈ వార్త వైరల్ అయిపోయింది. పైఅధికారుల వరకు ఈ వార్త వెళ్లడంతో.. ఆ ట్రాఫిక్ పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.