సభ ప్రాంగణంలో భారీగా ట్రాఫిక్‌ జాం

TRAFFIC JAM
TRAFFIC JAM

సభ ప్రాంగణంలో భారీగా ట్రాఫిక్‌ జాం

ముందస్తు ప్రణాళికలు వేసినా విఫలమైన పోలీసుల వ్యూహం
సభా ప్రాంగణం చేరుకోకుండానే లక్ష మందికి పైగా జనం వెనుదిరిగిన వైనం

హైదరాబాద్‌: తెలంగాణ సర్కారు అట్టహాసంగా నిర్వహిం చిన ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఆదివా రం సాయంత్రం జరిగిన ఈ సభకు శనివారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను, ప్రజలను తరలించడంలో టిఆర్‌ఎస్‌ నాయకులు కృషి చేయ డం తెలిసిందే. ఇందులో భాగంగా పలు జిల్లాల నుంచి వేల సంఖ్యలో ట్రాక్టర్లు సభ జరిగిన ప్రాంతానికి శనివారం మధ్యాహ్నం నుంచి తరలివచ్చాయి. ఇక ఆది వారం నాటి సభ కోసం వేల సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ఇతర వాహ నాలు ఒక్కసారిగా సభ ప్రాంగణం వద్దకు తరలిరావడంతో అవుటర్‌ రింగు రోడ్డుపై ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

ఈ సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు చేస్తామని, పార్కింగ్‌ కోసం ఇబ్బందు లు పడవద్దని పోలీసులు ముందుగా ప్రకటించినా చివరి నిమిషంలో నెలకొన్న పరిస్థితులతో అంతా తారుమారైంది. దీంతో లక్ష మందికి పైగా ప్రజలు ట్రాఫిక్‌ జాంలో ఇరుక్కుని సభా ప్రాంగణం వద్దకు చేరుకోకుండానే వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబట్టిన ప్రగతి నివేదన సభ వద్ద అనుకోకుండా తలెత్తిన ట్రాఫిక్‌ జాం వల్ల భారీ సంఖ్యలో ప్రజలు, టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరాశ తో వెనుదిరిగారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టిఆర్‌ఎస్‌ పార్టీ భారీ సన్నాహాలు చేయడం తెలిసిందే.

దేశంలో ఎక్కడా, ఎప్పుడు జరగని రీతిలో 25 లక్షల మందిని తరలించేందుకు టిఆర్‌ఎస్‌ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లు, కార్లు, బస్సులు ఇలా అనేక రకాల వాహనాల ద్వారా ప్రజల ను తరలించేందుకు సన్నాహాలు చేసినా ఇందులో లక్ష మందికి పైగా ప్రజలు సభ ప్రాంగణం వద్దకు చేరుకోలేక పోయారు. సభ జరిగిన కొంగర కలాన్‌కు చేరుకునేందు కు అవుటర్‌ రింగు రోడ్డు సులభమైన రహదారి అవడంతో అందరు ఈ మార్గాన్నే ఎంచుకోవడంతో పెద్ద సమస్య వచ్చి పడింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు త మకు సమీపంలో వున్న అవుటర్‌ మార్గాన్ని ఎంచుకుని అక్కడి నుంచి కొంగర కలాన్‌కు వచ్చేందుకు వాహనాల్లో ప్రయాణించారు. ఇలా అవుటర్‌కు వున్న అన్ని టోల్‌ గేట్ల నుంచి కొంగర కలాన్‌కు ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు తరలిరావడంతో కొంగర కలాన్‌ వద్ద ఒక్కసారిగా వాహనాల రద్దీ ఏర్పడింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ జాం ఏర్పడగా సాయంత్రం ఆరు గంటలకు మరింత తీవ్రం అయ్యింది. సిఎం ప్రసంగం వినాల ని దూరంనుంచి వచ్చిన వారుట్రాఫిక్‌ జాంలో ఇరుక్కుని నిరాశతో వెనుదిరిగారు. ట్రాఫిక్‌ జాంలో ఇరుక్కున్న వారు నీళ్లు, భోజన వసతులు లేక ఇబ్బందులు పడ్డారు.

దీంతో సభకు హాజరయిన వారి సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. ఇదే విషయాన్ని సిఎం కెసిఆర్‌ తన ప్రసంగంలో వివరిస్తూ ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుని చాలా మంది సభకు రాలేక పోవడం బాధాకరమని అన్నారు. చివరి నిమిషంలో విఫలమైన పోలీసుల వ్యూహం ఇదిలావుండగా ప్రగతి నివేదన సభ వద్ద ఎలాంటి ట్రాఫిక్‌ జాంలు లేకుండా వుండేందుకు పోలీసులు భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు ముందస్తు వ్యూహం ఎంచు కున్నా చివరి నిమిషంలో అంతా తారుమారైంది. సభకు వచ్చే వాహనాలన్నీ పలు మార్గాలలో వస్తాయని పోలీసులు అంచనా వేయగా ఇందుకు భిన్నంగా 90 శాతం వాహనాలు అవుటర్‌ రింగు రోడ్డు నుంచే రావడంతో పోలీసుల అంచనాలు తప్పాయి.

అవుటర్‌ రింగు రోడ్డు నుంచి కొంగర కలాన్‌కు వెళ్లేందుకు ఒకే మార్గం వుండడం , ఈ మార్గం వద్ద ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రావడంతో పోలీసులకు ఏమీ పాల్పడలేదు. ఇక ఇక్కడి నుంచి సభా ప్రాంగణం వద్ద వున్న మార్గాలు కూడా అడ్దదిడ్డంగా వుండడంతో ట్రాఫిక్‌ జాం మరింత పెరిగేందుకు దారితీసింది. దీనిపై పోలీసు అధికారులు మాట్లాడుతూ అవుటర్‌ నుంచి ఇన్ని వాహనాలు వస్తాయని తా ము అంచనా వేయలేక పోవడం వల్లే ట్రాఫిక్‌ జాం ఏర్పడిందని వారు తెలిపారు. ఇక ఈ సభకు వచ్చిన వాహనాలు తిరిగి వెళ్లడం ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలయ్యింది. సోమవారం తెల్లవారు జాము వరకు వాహనాలు పూర్తిగా వెళ్లే అవకాశాలున్నాయి. ఇక ట్రాక్టర్ల తిరుగు ప్రయాణం సోమవారం జరగనుంది. ఇ వన్నీ సోమవారం రాత్రి వరకు తమ స్వస్థలాలకు చేరుకునే వీలుంది.