17వ లోక్‌సభలో అత్యంత ధనిక ఎంపీలు

Parliament
Parliament

న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో అత్యంత ధనిక ఎంపీలు ఐదుగురు మాత్రమే. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన వారు ముగ్గురు కాగా, మిగతా ఇద్దరిలో ఒకరు వైఎస్‌ఆర్‌సిపి, మరొకరు టిడిపికి చెందిన ఎంపి.
నాకుల్‌నాథ్‌(చింద్వారా), కాంగ్రెస్‌

nakul nath
nakul nath


రాజస్థాన్‌ సియం కమల్‌నాథ్‌ కుమారుడు నాకుల్‌నాథ్‌ చింద్వారా నియోజకవర్గం నుంచి పోటీ చేసి బిజెపి అభ్యర్థి నాథన్‌ సాహ క్వరేటిపై 37,356 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఆస్తులు రూ. 660 కోట్లు.
హెచ్‌ వసంత్‌ కుమార్‌(కన్యాకుమారి), కాంగ్రెస్‌

h. vasantha kumar
h. vasantha kumar


తమిళనాడు కాంగ్రెస్‌కు చెందిన వసంత్‌కుమార్‌ కన్యాకుమారి నుంచి గెలుపొందారు. ఈయన ఆస్తులు రూ.417 కోట్లు, బిజెపి అభ్యర్థి రాధాకృష్టన్‌పై 2,59,933 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
డికె సురేశ్‌ (బెంగళూరు రూరల్‌), కాంగ్రెస్‌

d k suresh
d k suresh


కాంగ్రెస్‌ పార్టీ తరఫున బెంగళూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి డికె సురేశ్‌ గెలుపొందారు. సురేశ్‌ బిజెపి అభ్యర్థి అశ్వత్‌నారాయణ గౌడపై 2,06,870 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఆస్తులు రూ. 338 కోట్లు.
కనుమూరు రఘురామ కృష్ణ రాజా (నరసాపురం), వైఎస్‌ఆర్‌సిపి

Raghu Rama Krishnam Raju
Raghu Rama Krishnam Raju


ఏపిలోని నరసాపురం నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి తరఫున కనుమూరు రఘురామ కృష్ట రాజా టిడిపి అభ్యర్థి శివరామరాజుపై 31 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయన ఆస్తులు రూ. 325 కోట్లు.
జయదేవ్‌ గల్లా (గుంటూరు), టిడిపి

galla jayadev
galla jayadev


తెలుగు దేశం పార్టీకి చెందిన జయదేశ్‌ గల్లా గుంటూరు నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డిపై 4205 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జయదేవ్‌ ఆస్తులు రూ.305 కోట్లు. జయదేవ్‌ ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు అమర రాజా బ్యాటరీస్‌ ఓనర్‌ కూడా.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/