నేడు ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లు

NZ vs SL
NZ vs SL

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం నాడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రికార్డు స్థాయిలో ఐదు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన జట్టు ఒకటైతే..అంతర్జాతీయ వేదికలపై అద్భుతాలు సృష్టిస్తున్నది మరోకటి. శనివారం బ్రిస్టల్‌ వేదకగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా ,ఆసియా సంచలనం ఆఫ్ఘనిస్తాన్‌ మధ్యపోరు జరగనుంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌ వేదికగా నేడు శ్రీలంకతో న్యూజిలాండ్‌ తలపడనుంది. ఆఫ్ఘన్‌పై అదిరిపోయే బోణి కొట్టేందుకు ఆసీస్‌ జట్టు తహతహలాడుతుంది.

AFG vs AUS
AFG vs AUS

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/