కరోనా కట్టడికి క్రమశిక్షణే మందు

కఠిన విధానాలు తప్పనిసరి : సిఎం జగన్‌

AP CM YS Jagan

అమరావతి: క్రమశిక్షణ తోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించ గలుగుతామని ఎపి సిఎం వై ఎస్ జగన్ స్పష్టం చేసారు. కరోనాను కట్టడి చేసేందుకు కొన్ని కఠిన తర విధానాలను అమలు చేయక తప్పడం లేదన్నారు.

మన రాష్ట్రానికి చెందిన వాళ్ళనే చిరునవ్వుతో ఆహ్వానించడానికి బదులు సరిహద్దుల లోనే నిలిపి వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు.

ఎక్కడ వున్న వాళ్ళు అక్కడే ఉండాలన్నారు.కరోనా లాంటి వ్యాధులు వందేళ్ళకు ఒకసారి వస్త్తాయో రావో తెలియవన్నారు.

ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమర్ద్దవంతంగా ఎదుర్కోలేక పోతే చాలా కష్ట్టమైన పరిస్థితు లను చవిచూడాల్సివస్త్తుందన్నారు. ఇటువంటి వ్యాధులను మనతరంలో చూస్తామనుకోలేద న్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ గురువారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహిం చిన మీడియా సమావేశంలో మాట్ల్లాడుతూ ప్రస్త్తుత విపత్కర పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

కరోనా లాంటి వ్యాధిని నియంత్రించాలంటే క్రమశిక్షణ అత్యంత అవసరమన్నారు.అందువలనే ప్రజలు లౌక్‌డౌన్‌కు సహకరించాలన్నారు.

లాక్‌డౌన్‌ కారణంగానే తెలంగాణానుంచి వస్తున్న మనవాళ్ళను రాష్ట్ట్రంలోకి అనుమతించలేక పోవడం తనకు బాధకలిగించిందన్నారు.

దురదృష్ట్టవశాత్త్తు వారిని చిరునవ్వుతో ఆహ్వ నించే పరిస్దితి లేదని,ఎక్కడి వాళ్ళు అక్కడికి పరిమితం కాకుంటే వ్యాధిని కట్ట్టడి చేయ లేమన్నారు.

ఈ పరిస్ద్దితుల్ల్లో ప్రదేశం మారితే ఇబ్బంది కలిగితే ఇబ్బంది ఏంటో ఆలోచించాలన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/