ఎంపీలుగా ప్రమాణం చేసిన బెంగాలీ నటీమణులు

Nusrat Jahan Ruhi and Mimi Chakraborty
Nusrat Jahan Ruhi and Mimi Chakraborty

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన పశ్చిమబెంగాల్‌ నటీమణులు, తృణమూల్‌ సభ్యులు నస్రత్‌ జహాన్‌ రూహి, మిమి చక్రవర్తి మంగళవారం నాడు ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఈ రోజు సభ ప్రారంభం కాగానే వారిద్దరు బెంగాలీ భాషలో ప్రమాణం చేశారు. వందేమాతరం, జైహింద్‌ అంటూ దాన్ని ముగించారు. అనంతరం వారు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా పాదాలకు నమస్కరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను పలకరించడం సాంప్రదాయం.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/