టిక్‌టాక్‌, వీ చాట్‌లపై అమెరికా నిషేధం

tiktok-and-wechat-america

వాషింగ్టన్‌: చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ దేశ వాణిజ్య విభాగం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా సెప్టెంబర్‌ 15లోపు, టిక్‌ టాక్, వీ చాట్‌ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్‌ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్‌బుర్‌ రాస్‌ చెప్పారు. టిక్‌ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్‌ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/