మమతను చంపితే రూ. కోటి, ఆకాశ రామన్న లేఖ

mamata banergee
mamata banergee

కోల్‌కత్తా: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీని చంపితే రూ. కోటి ఇస్తామని ఆరాంబాగ్‌ ఎంపి అపరూప పొద్దార్‌కు గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాశారు. ఈ లేఖపై పొద్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేఖలో మమత ఫోటోను మార్ఫ్‌ చేసి పంపించారు. ఐతే రాజ్‌వీర్‌ కిల్లా అనే వ్యక్తి లేఖ రాసినట్లు ఉంది. అతని మొబైల్‌ నంబరు కూడా లేఖలో పొందుపరిచారు. బీధన్‌నగర్‌కు చెందిన రాజ్‌వీర్‌ కిల్లాను పోలీసులు సంద్రించగా..తన పేరును తప్పుగా అక్కడ వాడుకున్నారని, ఆ లేఖతో తనకెలాంటి సంబంధం లేదని అతను స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/