రాజీనామా చేయనున్న బ్రిటన్‌ ప్రధాని!

బ్రెగ్జిట్‌ వైఫల్యం, ఒత్తిడి తెస్తున్న సొంత పార్టీలు

theresa may
theresa may

లండన్‌: బ్రెగ్జిట్‌ ఒప్పందంలో సొంత పార్టీ అభ్యర్దుల మద్దతు కూడగట్టలేని పరిస్థితి వలన బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే ఎట్టకేలకు రాజీనామాకు సిద్దమైంది. జూన్‌ 7న తాను కన్సర్వేటివ్‌ పార్టీ అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతానని ఆమె ప్రకటించారు.
ఈయూలో బ్రెగ్జిట్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్‌ పార్టీ బ్రిటన్‌ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో ఆమెపై రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె రాజీనామా చేస్తారని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఈయూ నుండి బయటకు రావాలంటూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయింది. దీంతో కన్సర్వేటివ్‌ పార్టీ సభ్యులే ఆమెకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. బ్రెగ్జిట్‌ గడువు అక్టోబర్‌ 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల్లో ఆమెను రాజీనామాకు ఒత్తిడి తెస్తున్నారు. ఈయూ నుండి వైదొలగాలన్న ప్రతిపాదనకు 2016లోనే ప్రజల నుండి మద్దతు లభించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/