భారత్‌కు భారీగా నిధులు కేటాయించిన ప్రపంచ బ్యాంకు

కరోనా నివారణకు 1 బిలియన్‌ డాలర్లు కేటాయింపు

world bank
world bank

దిల్లీ: భారత్‌ కరోనా వ్యాప్తిని నివారించడానికి గాను ప్రపంచ బ్యాంకు భారీ ఆర్ధిక సహయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 25 అభివృధ్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్‌ డాలర్లను సంస్థ విడుదల చేసింది. ఇందులో అధిక భాగం అనగా 1 బిలియన్‌ డాలర్లు ఇండియాకు కేటాయించింది. ప్రస్తుతం ఇండియాలో కరోనా రెండవ దశలో ఉంది. ఇది మూడవ దశకు చేరుకుంటే.. ఆ ప్రభావం ఊహించలేంతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19 ఉత్తమ నిర్ధారణ, అనుమానితుల ఆచూకీ, ప్రయోగాలు, వ్యాధి నియంత్రణ సామాగ్రి కోనుగోలు వంటి పనులకు వాడేందుకు తాము ఈ నిధిని మంజూరు చేసినట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/