25 నిమిషాలలోనే ఫలితం

ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల ద్వారా త్వరగా తేలుతున్న కరోనా ఫలితం

rapid testing kit
rapid testing kit

చెన్నై: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షలు చేయడానికి చైనా నుంచి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను దిగుమతి చేసుకుంది. తాజాగా దిగుమతి చేసుకున్న పరికరాలతో మరింత వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరికరాలతో కేవలం 25 నిమిషాలలోనే పరీక్ష ఫలితం వస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల ముంది రాష్ట్రానికి 24వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు వచ్చాయి. వీటిని రాష్ట్రంలోని పలు ఆసుప్రతులకు కేటాయించారు. చెన్నైలోని రాజీవ్‌ గాంధీ స్మారక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వెయ్యి కిట్లు కేటాయించారు. వీటి పనితీరుపై ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ జయంతి వివరించారు. ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పరికరంలో రెండు ద్వారాలు ఉంటాయని,అందులో ఒక ద్వారంలో రోగి రక్త నమూనాలను ఉంచి, మరోక ద్వారంలో రక్తాన్ని పరీక్షించేందుకు అవసరమయ్యే రసాయన ద్రావణాన్ని ఉంచుతారు. రక్తంలో రసాయన ద్రావణం కలిసిన తరువాత స్క్రీన్‌పై ఫలితం కనపడుతుంది. స్రీన్‌ పై ఒక గీత కనిపిస్తే రోగికి నెగిటివ్‌గా నిర్దారిస్తారు. అలాగే రెండు గీతలు కనిపించినట్లయితే వ్యక్తికి పాజిటివ్‌గా గుర్తింస్తారు. దీంతో రోగికి తక్షణ వైద్యసదుపాయం అందించడానికి వీలవుతుంది అని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/