అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా: కేటీఆర్‌

ktr
ktr

హైదరాబాద్:  టీఆర్‌ఎస్‌లో చేరికలు సంతోషమని టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాములునాయక్‌ పార్టీలో చేరారని, వైరా నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ గాలి వీస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వచ్చిందని, రాబోయే రోజుల్లో గులాబీ జెండా అన్ని నియోజకవర్గాల్లో ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు.