అమెరికాలో వేగంగా కరోనా విస్తరణ

పదివేలకు చేరువలో మృతుల సంఖ్య

donald trump
donald trump

వాషింగ్టన్‌: కరోనా మహామ్మారి అమెరికాను కకావికలం చేస్తుంది. అమెరికాలో ఇప్పటి వరకు పదహరు లక్షల మందికి కరోనా పరీక్షలు చేశామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపాడు. కాగా ఇప్పటి వరకు అమెరికలో కరోనా భాధితుల సంఖ్య 3.37 లక్షలకు కు చేరగా.. మృతుల సంఖ్య 9,626 కు చేరింది.ఆదివారం ఒక్కరోజే ఈ వైరస్‌ కారణంగా అమెరికాలో 1,188 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, ఈ నిబంధనలు దేశంలోని 95 శాతం జనాభాకు వర్తిస్తాయని ట్రంప్‌ అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/