కరోనా వ్యాప్తి..ఆరు రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచన

Coronavirus
Coronavirus

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అన్ని ముందుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరింది. ఆగ్రా నగరానికి చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కరోనా బాధితుడితో కలిసి ఉంది. దీంతో ఆ కుటుంబానికి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/