మందడంలో తీవ్ర ఉద్రిక్తత

mandadan
mandadan

అమరావతి: రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ దేవత పోలేరమ్మకు మొక్కులు చెల్లించేందుకు గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకోవడంతో మహిళలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. లాఠీచార్జ్‌లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. పోలీసుల వలయాన్ని అడ్డుకుని ప్రజలు ముందుకు వెళ్తున్నారు. రాజధానిలో పోలీసుల తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏపీలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా అని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు తమను శిక్షిస్తారా అని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా లాఠీచార్జ్ చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/