ప్రారంభమైన మేడారం మహాజాతర

నేటి నుండి మూడు రోజుల పాటు మహా ఉత్సవం

https://youtu.be/tBCDNV3V7TM
Medaram – Sammakka Sarakka Jatara 2020

హైదరాబాద్‌: మేడారం మహాజాతర ఈరోజు నుండి ప్రారంభమైంది. మేడారానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. నేడు పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఆనవాయితీ ప్రకారం పెనుక వంశస్తులు మహబూబాబాద్ జిల్లా పోనుగొండ్ల నుంచి.. సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకురానున్నారు. పడిగిద్దరాజును తీసుకు వచ్చేందుకుు కాలినడకన 66 కి.మీ.అటవీ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది. పెనుక వంశస్తులు కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని సైతం తీసుకురానున్నారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు రానుండడంతో అప్పటి వరకు ఎక్కడి భక్తులు అక్కడే సారల మ్మ రాకకోసం వేచి చూస్తున్నారు. బుధవారం ఉ దయం మహబూబాబాద్ జిల్లా గంగారం మం డలం పూనుగొండ్ల నుంచి సోమవారం పయనమై న పగిడిద్దరాజు మంగళవారం సాయంత్రానికి గు ండాల నుంచి పస్రా పరిసర ప్రాంతాల్లోకి చేరుకున్నారు.

నేటి ఉదయం పస్రాకు చేరుకొని అక్కడి నుంచి మేడారం వనజాతర ద్వారం ద్వారా సమ్మక్క చిలుగలగట్టుకు చేరుకోనున్నారు. ఎదుర్కోళ్లు నిర్వహించి పెండ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్ని చేసిన తరువాత గద్దెకు చేర్చడానికి ఏర్పాట్లను వడ్డెలు పూర్తి చేశారు. ఆతరువాత సారలమ్మ అశేష జనవాహిని మధ్య కన్నెపల్లి నుంచి భారీ మేళతాళాలు, ఎదుర్కోళ్లతో బుధవారం సాయంత్రానికి గద్దెకు చేరనున్నారు. సారలమ్మతో పాటు ఆమె భర్త గోవిందరాజు, చిన్నమ్మ నాగులమ్మ, సోదరుడు జంపన్నలు అదే సమయంలో గద్దెకు చేరుతారు. ఈ కార్యక్రమంతో జాతరలో మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది.గురువారం సాయంత్రం సమ్మక్కను గద్దెకు తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/