నావల్ల కాదు .. ఎన్టీఆర్‌ బయోపిక్‌ నుంచి తేజ ఔట్‌

NTR BIOPIC Launching (File), TEJA
NTR BIOPIC Launching (File), TEJA

నావల్ల కాదు …

ఎన్టీఆర్‌ బయోపిక్‌నుంచి తేజ ఔట్‌

తెలుగుతేజం ఎన్టీఆర్‌ జీవితచరిత్రను తెరకెక్కించాలన్న ప్రయత్నం ఆదిలోనే బెడిసికొట్టింది.. ముహూర్తం కూడ ముగిసి, రేపోమాపో సెట్స్‌పైకి వెల్లనున్న క్రమంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ మూలనపడే ప్రమాదంలో చిక్కుకుంది.. ఏకంగా దర్శకుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.. ఎన్టీఆర్‌ సినిమాకు న్యాయం చేయలేమోనన్న భయంతో డ్రాప్‌ అవుతున్నట్టు డైరెక్టర్‌ తేజ ప్రకటించారు.. ఏడాదిపాటు కష్టపడి స్క్రిప్టు ఓకే చేసి క్యాస్టింగ్‌ విషయంలో కూడ కొద్దికొద్దిగా క్లారిటీకి వస్తున్న ఈ తరుణంలో తేజ వెనుకడుగు వేయటం ప్రధానంగా సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే చిత్రంలో పొలిటికల్‌ కంటెంట్‌ తగ్గించాలని నిర్ణయించినప్పటికీ , వివాదాలకు దొరక్కుండా అవుట్‌పుట్‌ తీసుకురావటం కష్టమని తేజ ముందునుంచీ చెబుతూ వచ్చారు. ఇన్ని అవరోధాల్ని దాటుకుని కూడ బయోపిక్‌కి తొలిక్లాప్‌ వరకు లాక్కొచ్చింది యూనిట్‌.. బయోపిక్‌ తీయాలన్న తన లక్ష్యాన్ని బాలకృష్ణ బయటపెట్టినపుడే రెండు మూడు పోటీ బయోపిక్‌లు తెరమీదకు వచ్చాయి. ఇదిలా ఉంటే తేజ ఇచ్చిన షాక్‌తో ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిజంగానే ప్రశ్నార్థకంగా మారింది.