రాజ్యసభలో టిడిపి విలీనం పూర్తి

TDP MPs
TDP MPs

న్యూఢిల్లీ: రాజ్యసభలో బిజెపిలోకి టిడిపి విలీన ప్రక్రియ పూర్తయింది. నిన్న సుజనాచౌదరి, సియం రమేశ్‌, టిజి వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. మొత్తం ఆరుగురు ఎంపీల్లో నలుగురు బిజెపి తీర్ధం పుచ్చుకోవడమే కాకుండా టిడిపి పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మానం లేఖణు రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గురువారం అందజేశారు. ఆ వెంటనే టిడిపి పక్షాన్ని బిజెపిలో విలీనం చేసుకుంటున్నామని పేర్కొంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా రాసిన లేఖణు బిజెపి నేతలు ఉపరాష్ట్రపతికి ఇచ్చారు. బిజెపిలోకి టిడిపి విలీన ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు. దీంతో రాజ్యసభ రికార్డుల్లో పార్టీల వారీ జాబితాలో మార్పులు చేశారు. వీరి చేరికతో రాజ్యసభలో బిజెపి సభ్యుల సంఖ్య 75కి చేరింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/