చెన్నైకి రైళ్లలో 6 నెలల పాటు నీటి సరఫరా!

దాహార్తిని తీర్చేందుకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం

water train
water train

చెన్నై: చెన్నై వాసుల దాహార్తిని తీర్చడానికి పళని స్వామి ప్రభుత్వం ఏర్పాటు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే రైళ్లలో నీటిని వెల్లూరు నుంచి చెన్నైకి తరలించింది. వెల్లూరు జిల్లాలోని జోలార్‌పేట్‌ నుంచి బయలుదేరిన తొలి రైలు శుక్రవారం నాడు చెన్నైకి చేరుకుంది. తమిళనాడు వాటర్‌ సప్లై అండ్‌ డ్రైనేజ్‌ బోర్డు బుధవారం దీనికోసం ప్రత్యేకంగా టెస్ట్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించింది. పూండి, షోలవరం, చెంబరంబాక్కం, రెడ్‌ హిల్స్‌ చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో చెన్నైకి నీటి ఇక్కట్లు తప్పలేదు. దీంతో రైళ్ల ద్వారా నీటిని అందించాలని పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు నెలల పాటు ఈ తరహా నీళ్లు అందిస్తామని సియం పళని స్వామి చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/