నటి స్నేహ భర్తకు షాకిచ్చిన విద్యుత్ బోర్డు

రూ.70వేలు చెల్లించాలంటూ నోటీసు

Prasanna, Sneha

చెన్నై: ప్రముఖ తమిళ సినీనటుడు, నటి స్నేహ భర్త ప్రసన్నకు విద్యుత్‌ బోర్డు షాక్‌ ఇచ్చింది. ఒక నెలకు ఏకంగా రూ.70 వేల బిల్లు పంపి విస్తుపోయేలా చేసింది. ప్రసన్న, ఆయన తండ్రి, మామగారి ఇళ్లకు మొత్తంగా రూ. 70 వేల బిల్లు పంపిన బోర్డు.. వెంటనే చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. బిల్లు చూసి షాకైన ప్రసన్న విద్యుత్ బోర్డుపై మండిపడ్డారు. తానైతే రూ. 70 వేలు చెల్లించగలనని, కానీ ఇదే బిల్లు పేదల ఇంటికి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నిజానికి తమకు రెండు నెలలకు కూడా ఇంత బిల్లు రాదని, సాధారణంగా వచ్చే బిల్లుకు ఎన్నో రెట్లు ఎక్కువగా బిల్లు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 70 వేలు బిల్లు పంపిన విషయంపై విద్యుత్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. రెండు నెలలకు పైగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మీటరు రీడింగులో తప్పులు దొర్లాయన్నారు. ప్రసన్న ఇంటికి పంపిన బిల్లును సరిచేసి మళ్లీ పంపిస్తామని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/