కొత్తేమీ కాదు.. ఎప్పట్నుంచో ఉన్నదే..

‘బాయ్స్ లాకర్ రూమ్’ వివాదంపై తాప్సీ రియాక్షన్

Taapsee Pannu
Taapsee Pannu

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాయ్స్ లాకర్ రూమ్’ వివాదంపై హీరోయిన్ తాప్సీ స్పందించింది.

ఏదైనా బోల్డ్ గా సమాధానం చెప్పే తాప్సీ తాజాగా స్కూలు విద్యార్థుల చాటింగ్స్ తనకు పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘నేనే కాదు.. అలాంటి చాట్స్ చూసి ఎవ్వరూ ఆశ్చర్యపోరు.. అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడుకోవడం..చర్చలు పెట్టడం కొత్తేమీ కాదు.. ఎప్పట్నుంచో ఉన్నదే..

ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఇదంతా బయటకొచ్చింది. జనాలు ఇంత అతిగా రియాక్డ్ అవ్వడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’ అని తాప్సి ఢిల్లీ బాయ్స్ లాకర్ రూమ్ చాటింగ్ ను లైట్ తీసుకుంది.

అబ్బాయిలు అమ్మాయిల్ని చూసే విధానం మారేంత వరకు ఇలాంటివి సమాజంలో జరుగుతూనే ఉంటాయని .. సినిమాలు కూడా విద్యార్థులను చెడగొడుతున్నాయని తాప్సీ ఆవేదన వ్యక్తం చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/