ఒక్కొక్కరు ఐదు పెళ్లిళ్లు లేదంటే జైలుకే..

అసత్య వార్తలను తోసిపుచ్చిన ఆ దేశాధ్యక్షుడు

Mswati III
Mswati III

ఆఫ్రికా ఖండంలో ఓ చిన్న దేశం స్వాజిలాండ్‌. ఆ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు మెస్వాతి-3 జారీ చేసిన ఓ విచిత్రమైన ఆదేశాలు, తమ దేశంలో పెళ్లీడు వచ్చిన ప్రతి యువకుడూ కనీసం ఐదు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను పాటించని వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
ఐదు అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని, ఒక్కో కుటుంబానికి ప్రభుత్వ ఖర్చుతో ఇంటిని కట్టిస్తామని ఆయన ప్రకటించారు. ఈ ఆదేశాలు కాస్తా సంచలనం రేపాయి. ఐతే ఈ ప్రకటనలను ఆ దేశ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి ప్రకటనలు తమ దేశాధ్యక్షుడు చేయలేదని, నిరాధార మైనవి అంటూ ఓ అధికారికి ప్రకటనను విడుదల చేసింది ఆ దేశ ప్రభుత్వం.
స్వాజిలాండ్‌ మొత్తం జనాభా 14 లక్షల 50 వేలు. ఇందులో మహిళల సంఖ్య అత్యధికం.ఎంత అధికం అంటే…పురుషులతో పోలిస్తే స్త్రీ ల జనాభా మూడింతలు ఎక్కువ. దీనితో చాలా మంది యువతులకు పెళ్లిళ్లు కావట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో యువకుడు కనీసం ఐదు మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఆ దేశ అధ్యక్షుడు మెస్వాతి-3 15 మంది భార్యలు ఉన్నారు. 25 మంది సంతానం ఉంది. ఆయన తండ్రికి 70 మంది భార్యలు, 150 మందికి పైగా సంతానం ఉంది. దేశంలో మహిళా శాతం తగ్గించేందుకు ఆ దేశాధ్యక్షుడు ఇలాంటి కఠినతరమైన ఆదేశాలను జారీ చేయాల్సి వచ్చిందని అంటూ ఆ దేశ అధికారులను ఉటంకిస్తూ కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు దీనికి సంబంధించిన కథనాలను ప్రచురించాయి. ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వ అధికారులు తోసిపుచ్చారు. ఇలాంటి ప్రకటనలు ఆయన నుంచి అధికారికంగా వెలువడలేదని స్వాజిలాండ్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/