సుందర్‌ పిచాయ్‌కి, ఫ్రైడ్‌మాన్‌కు ‘గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డు’

sundar pichai, friedman
sundar pichai, friedman


వాషింగ్టన్‌: గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌కి అమెరికా భారత వాణిజ్య మండలి(యూఎస్‌ఐబిసి) ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్‌ లీడర్‌షిప్‌ అవార్డును ప్రకటించింది. 2019కిగాను సుందర్‌ పిచాయ్‌తో పాటు నాస్‌డాక్‌ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్‌మాన్‌ను ఎంపిక చేసింది. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్దికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకు గాను వారిని ఎంపిక చేసినట్లు మండలి పేర్కొంది. వచ్చేవారం జరగబోయే ఇండియా ఇండియాస్‌ సదస్సులో వారికి అవార్డును ప్రధానం చేయనున్నారు. గూగుల్‌, నాస్‌డాక్‌ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్‌ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150 శాతం మేర వృద్ది చెందినట్లు యూఎన్‌ఐబిసి వెల్లడించింది.
ఈ సందర్భంగా నాస్‌డాక్‌ అధ్యక్షుడు ఫ్రైడ్‌మాన్‌ స్పందిస్తూ..యూఎస్‌ఐబిసి కృషితో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక బంధం కూడా బలపడుతుందని అభిప్రాయపడ్డారు. పిచాయ్‌ మాట్లాడుతూ..గూగుల్‌ అభివృద్దికి భారత్‌ ఎంతగానో తోడ్పాటునందిస్తుందని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/