ఆదివారం ‘జనతా కర్ఫ్యూ ‘

ప్రధాని మోడీ పిలుపు

Modi’s call for ‘Janata curfew’ on Sunday

New Delhi: ప్రపంచం కరోనా గుప్పెట చిక్కుకుని విలవిలలాడుతోందని ప్రధాని మోడీ అన్నారు. కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు.

గత రెండు నెలలుగా  ప్రపంచం మొత్తం కష్టాల్లో కూరుకుపోయిందన్నారు.

కరోనా పట్ల నిర్లక్ష్యం పనికి రాదని చెప్పిన ఆయన కరోనా కారణంగా ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. భారతీయులు కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

గత కొద్ది రోజులుగా పరిస్థితి అదుపులోనికి వచ్చిందని చెబుతున్నారు అయితే కరోనా విషయంలో నిర్లక్ష్యం పనికి రాదని మోడీ చెప్పారు.

రానున్న వారాల్లో దేశంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరగనుంది

కరోనా ప్రభావం భారత్ పై ఉండదని తేలికగా తీసుకోరాదని మోడీ అన్నారు. జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన రానున్న కొద్ది వారాలలో దేశంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరగనున్నదని చెప్పారు.

కరోనా వైరస్ కు మందులేదనీ, ధృఢచిత్తం, సంకల్పమే మందని పేర్కొన్నారు. మన ఆరోగ్యమే ప్రపంచ ఆరోగ్యమన్నది అందరూ గుర్తెరిగి వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలని మోడీ పిలుపునిచ్చారు.

130 కోట్ల మంది భారతీయులూ ఇదే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. కొన్ని వారాల పాటు దేశం కోసం త్యాగాలు చేయాలని మోడీ పేర్కొన్నారు. మనని మనం కాపాడుకోవాలన్నారు.

ఆదివారం ‘జనతా కర్ఫ్యూ ‘

దేశ వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున్నట్లు మోడీ ప్రకటించారు. మీడియా, ప్రభుత్వోద్యోగులు మినహా మిగిలిన వారంతా ప్రపంచం నుంచి తమను దూరం చేసుకోవాలని మోడీ అన్నారు.

ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని మోడీ పిలుపు నిచ్చారు. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యం కోసం, మనని మనం కాపాడుకునేందుకేనని ఉద్ఘాటించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని మోడీ పిలుపునిచ్చారు.

‘జనతా కర్ఫ్యూ ‘పై ప్రజలకు విస్తృతంగా అవగాహన

జనతా కర్ఫ్యూపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మోడీ పిలుపు నిచ్చారు. ఇందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ కృషి చేయాలన్నారు. ఆ తరువాత కూడా వారం రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని మోడీ సూచించారు.

ఇంటి నుంచి బయటకు రావాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలన్నారు. ఆదివారం అంటే ఈ నెల 22న పాటించే జనతా కర్ఫ్యూని విజయవంతం చేయడం ద్వారా మన సంయమనాన్ని చాటుదామని మోడీ పిలుపునిచ్చారుజ

కరోనా కారణంగా మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా మొదటి ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రధాని మోడీ అన్నారు. కరోనాపై జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన మొదటి, రెండో ప్రపంచ యుద్ధం కాలంలో కూడా ఇన్ని దేశాలు ప్రభావితం కాలేదన్నారు.

కరోనా వైరస్ మాత్రం ప్రపంచ దేశాలన్నిటినీ అయోమయంలో పడేసిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారి వైరస్ ప్రభావంతో ఇక్కట్లు పడుతున్నాయని మోడీ పేర్కొన్నారు.

కరోనాను తేలిగ్గా తీసుకోవడంలేదనీ, బాధితులను ఐసోలేషన్ కు తరలిస్తున్నామన్నారు.

కరోనాతో పోరు విషయంలో దృఢ సంకల్పం, తగిన జాగ్రత్తలు పాటించడం అవసరమని ఆయన అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండటం ద్వారా ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచగలమని గ్రహించాలని మోడీ అన్నారు.

కరోనా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

అనారోగ్యంగా ఉన్నవారు, కరోనా లక్షణాలు కనిపించిన వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని మోడీ అన్నారు. జాతి నుద్దేశించి ప్రసంగించిన మోడీ కరోనా లక్షణాలున్న వారు జనంలో తిరిగితే తమకు తాము అన్యాయం చేసుకోవడమే కాకుండా, తమ కుటుంబాలకూ, సమాజానికీ కూడా అన్యాయం చేసినట్లేనని చెప్పారు.

వైద్య శాఖపై భారం పెంచొద్దు

వైద్య శాఖపై భారం పెంచొద్దన్నారు. సాధారణ చెకప్ లను కొద్ది వారాలు వాయిదా వేద్దామన్నారు. వైద్యులు కూడా అత్యవసరం కాని ఆపరేషన్లను వాయిదా వేసుకోవాలన్నారు. కరోనా ఆందోళనతో అనవసరంగా ఆసుపత్రులకు వెళ్లోద్దన్నారు.

కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల నిజమైన బాధితులకు సత్వర వైద్యం అందించే వీలుంటుందన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/